భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు వరదతో ముగినిపోయయై. వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు.