ఇదేనిజం, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తుంకారం తండాకు వెళ్లే రోడ్డంతా బురద మాయమయ్యింది. చిరుజల్లుల వర్షం కురవగానే రోడ్డు పై ఉన్న గుంతల్లో వర్షం నీరు నిలిచి బురద మాయమయ్యింది. నడిచి వెళ్లాలంటే నరకంగా ఉందని తండా వాసులు తెలిపారు. ఉన్న మట్టి రోడ్డు కాస్త బురద మాయమై గుంతల్లో నీరు చేరి, చెరువులగా మారింది. వర్షం పడితే చాలు రోడ్డు మొత్తం బురదమాయమై ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని తండా వాసులు పేర్కొన్నారు. ఏదైనా అత్యవసరం అయితే ఏ వాహనాలు కూడా వెళ్లాలని పరిస్థితి ఉందని అన్నారు. గుంతలో ఎక్కడ ఏముందో తెలియక చీకట్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరలు అధికారంలో ఉన్నపుడు తండా రోడ్డు గురించి పట్టించుకోలేదాని అన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తుకారాం తండా రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదు అని అంటున్నారు. తండాలో ఏదైనా ఏమార్జెనీ వస్తే కూడా అంబులెన్స్ వెళ్లలేని దుస్థితి ఏర్పడింది అన్నారు. అధికారులు స్పందించి రోడ్డు సమస్యను తీర్చాలని తుకారాం తండా ప్రజలు కోరుకుంటున్నారు.