ICC Player of Month: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ 2025 మార్చి నెలకు ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ గుర్తింపు అతని ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శనకు గుర్తుగా లభించింది. ఇందులో భారత్ టైటిల్‌ను సాధించింది. శ్రేయస్ ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 5 మ్యాచ్‌లలో 243 పరుగులు (48.6 సగటు) సాధించి, రెండు అర్ధ సెంచరీలతో సత్తా చాటాడు. ఇందులో ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 45, మరియు ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు ముఖ్యమైనవి. ఈ అవార్డు కోసం శ్రేయస్ అయ్యర్ తో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర మరియు జాకబ్ డఫీలతో పోటీపడ్డాడు. ఈ అవార్డు శ్రేయస్‌కు రెండో ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు, గతంలో అతను ఫిబ్రవరి 2022లో ఈ గౌరవాన్ని పొందాడు.