HomeసినిమాGoose Bumps​ తెప్పిస్తున్న హృతిక్​ 'Fighter' Teaser

Goose Bumps​ తెప్పిస్తున్న హృతిక్​ ‘Fighter’ Teaser

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పడుకొనే, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ ‘ఫైటర్’. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరెకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్​ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. టీజర్ స్టార్టింగ్​లో ఆల్రెడీ పలు హాలీవుడ్ సినిమాల్లో చూసిన రెగ్యులర్ విజువల్స్​తోనే మొదలైంది. కానీ తర్వాత మాత్రం సిద్ధార్థ్ మరోసారి తన క్లాస్ చూపించాడనే చెప్పాలి. గ్రాండ్ యాక్షన్ అండ్ స్లో మోషన్ విజువల్స్​తో గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్​తో టీజర్​ను కట్ చేసాడు. అలాగే లాస్ట్ కొన్ని ఫాస్ట్ ఫార్వార్డ్ కట్స్​లో అయితే చాలానే సర్​ప్రైజ్​లు ఉన్నట్లుగా కన్ఫర్మ్ చేశాడు. ఇక వీటితో పాటుగా ఫైనల్ షాట్ అయితే హృతిక్ జాతీయ పతాకాన్ని పట్టుకొని రావడం అన్నిటికన్నా బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. ఇలా వచ్చే ఏడాది మరో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా అందించేలా మేకర్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img