Hug Benefits: కౌగిలింతతో మనసులోని భావాల్ని ఎదుటివారితో పంచుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనసులోని భావోద్వేగాలు అదుపులోకి వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి, నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉందా? అంటే అవుననే చెబుతున్నారు పరిశోధకులు. మనిషి మూడ్‌ను మార్చేసే శక్తి హగ్‌లో ఉందని ఇప్పటికే పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించాయి. ఇంకా కౌగిలింత వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గి రక్త పోటును అదుపు చేస్తుందని నిపుణులు చెబుుతన్నారు.