Homeఫ్లాష్ ఫ్లాష్ఒక్క హగ్ తో చాల సమస్యలకు చెక్

ఒక్క హగ్ తో చాల సమస్యలకు చెక్

వేల పదాలు ఇవ్వలేని భావాన్ని అందిస్తుందంటారు. అంతగా ఏముందీ హగ్ లో?

ఒక్క ప్రేమికులే కాదు అమ్మ, నాన్న, తమ్ముడు, అన్న.. ఎవరైనా ఆత్మీయంగా పలకరించుకోవాలంటే అది కౌగిలింతతోనే సాధ్యం.

హగ్ తో ఒంటరితనం, డిప్రెషన్‌, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలన్నీ కొంత వరకూ దూరమవుతాయి.

హగ్ వల్ల ఆక్సిటోసిన్‌ స్థాయి పెరుగుతుంది. ఈ ఆక్సిటోసిన్‌నే లవ్‌ హార్మోన్‌గా కూడా చెబుతుంటారు. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కౌగిలించుకుని కొంతసేపు ఉండిపోవడం వల్ల మెదడులో సెరొటోనిన్‌ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మనసుకి ఆనందంగా అనిపిస్తుంది.

కౌగిలింత వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

బిడ్డపుట్టిన వెంటనే తల్లి బిడ్డను హత్తుకోవడం ద్వారా బిడ్డకు తాను సురక్షితంగా ఉన్నానన్న భావన కలుగుతుంది.

అసోసియేషన్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ సైన్స్‌ చేసిన స్టడీ ప్రకారం చనిపోతామని భయపడే వారికి ఓ కౌగిలింతతో తామున్నామన్న భరోసా కల్పించవచ్చని తేలింది.

కౌగిలి వల్ల నెర్వస్‌ సిస్టమ్‌ బ్యాలెన్స్‌ అవుతుంది.

సంతోషంగా ఉండాలంటే రోజుకు నాలుగు కౌగిలింతలు అవసరం.

మెడదు మరింత రిలాక్స్ డ్ గా.. మరింత సంతోషంగా గడపాలంటే 8 నుంచి 10 కౌగిళ్లు అవసరమని థెరపిస్టులు చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img