దేశంలో 2025లో నిర్వహించే ప్రధాన పరీక్షలలో కీలక మార్పులు ఉండబోతున్నాయి. ఈ ఏడాది NEET-UG పరీక్షలకు సంబంధించి పేపర్ లీక్ వంటి ఘటనలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీంతో విద్యా మంత్రిత్వ శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ పలు సూచనలు చేసింది. ఈ క్రమంలోనే NEET-UG, JEE-మెయిన్స్, CUET-UG వంటి ముఖ్య పరీక్షలలో మార్పులు చేయనున్నారని తెలుస్తోంది.