తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అధికారులు వెల్లడించారు. విద్యుత్ డిమాండ్ దాదాపు 16 వేల మెగావాట్లకు పెరిగిందని వారు తెలిపారు. వేసవి, యాసంగి పంటల ప్రభావంతో ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగిందని అన్నారు. ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యుత్ సంస్థల అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించనున్నారు.