హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం ఏటా గణనీయంగా పెరుగుతోంది. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో విద్యుత్ డిమాండ్ 16.13% పెరిగిందని అధికారులు వెల్లడించారు. కంపెనీలు, ఫ్యాక్టరీలు, శివారు ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలు భారీగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 17.77% వృద్ధి రేటు నమోదైంది, అటు మేడ్చల్‌లో 16.31%, మెట్రో జోన్లో 13.86% పెరుగుదల కనిపించింది. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, 2022లో 3,435 మిలియన్ యూనిట్లు, 2023లో 3,756 మిలియన్ యూనిట్లు, 2024లో 4,352 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ సంఖ్యలు నగరంలో విద్యుత్ డిమాండ్ ఎంత తీవ్రంగా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి.