భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదుచేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు ఆర్‌బీఐ (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని పేర్కొంది. దీంతో ఈ విషయంలో చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది.