భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతోంది. వరుస అంతరిక్ష పరిశోధనలతో ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. కానీ ఇస్రో వివిధ రకాల ప్రాజెక్టుల కోసం ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది. ఇటీవల, ఈ సంస్థ పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, సైంటిస్ట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ www.isro.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి గడువు అక్టోబర్ 9 వరుకు ఉంది.
పోస్టులు-ఖాళీలు : ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా, మెడికల్ ఆఫీసర్-SD, మెడికల్ ఆఫీసర్-SC, సైంటిస్ట్ ఇంజనీర్-SC, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్-B, డ్రాఫ్ట్స్‌మన్-B, అసిస్టెంట్ (అధికారిక భాష) సహా మొత్తం 103 పోస్టులను ఇస్రో భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఇస్రో బెంగళూరు సెంట్రల్ ఆఫీస్‌లో పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ.. అభ్యర్థుల పనితీరును బట్టి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టే అవకాశం ఉంది.పోస్టును బట్టి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి రూ.21,700 నుండి రూ.2,08,700 మధ్య బేసిక్ జీతం పొందుతారు.