ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు భారీగా పెరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే అక్టోబర్ 16వ తేదీ నుంచి నిన్నటి వరకు అంటే డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6,312 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ 75 రోజుల్లో 26,78,547 కేసుల బీర్లు విక్రయించగా, 83,74,116 కేసుల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, వైన్ షాపులకు ఈ విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.