వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం ప్రజా సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కర్నూలు నుంచి పోటీ చేసి ఇంతియాజ్ ఓడిపోయిరు. 2019లో వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత ఇంతియాజ్ అహ్మద్ కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతియాజ్ అహ్మద్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు.