Homeహైదరాబాద్latest Newsభారత్ పై సంచలన వ్యాఖ్యలు.. అంతలోనే ముయిజ్జుకు భారీ షాక్..

భారత్ పై సంచలన వ్యాఖ్యలు.. అంతలోనే ముయిజ్జుకు భారీ షాక్..

మాలె మేయర్ ఎన్నికల్లో ముయిజ్జుకి గట్టి షాక్ తగిలింది. మాల్దీవులు రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్‎(PNC) పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. ఈ ఎన్నికల్లో మాల్దీవులు అధ్యక్షునికి చెందిన అభ్యర్థి కాకుండా.. భారత్‎కు అనుకూలమైన మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ(MDP) ఘన విజయం సాధించింది. మాలె మేయర్ గా ఆ పార్టీకి చెందిన ఆదమ్ ఆజీమ్ ఎన్నికయ్యారు.

PNC ఓటమికి కారణం గతంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలే అని స్పష్టం అవుతోంది. చైనాకు అనుకూలంగా మారిన ముయిజ్జుకి ఇది షాకింగ్ న్యూస్ గా మారింది.

Recent

- Advertisment -spot_img