Homeహైదరాబాద్latest Newsభర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి

భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి

– కరెంట్ పోల్ ఎక్కి మహిళ ధర్నా
– సప్లయ్​ను నిలిపి ఆమెను కిందకు తీసుకొచ్చిన పోలీసులు
– సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో
– ఉత్తరప్రదేశ్​లోని గోరఖ్​పూర్​లో ఘటన

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భర్త, పిల్లలున్న ఓ మహిళ మరో వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. చివరకు అది బయటపడటంతో ఇద్దరితో కలిసి ఉంటానంటూ మొండిపట్టు పట్టింది. అందుకు ఇంట్లోవాళ్లు అంగీకరించకపోవడంతో కరెంట్‌ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. పిప్రాయిచ్‌ ప్రాంతానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళకు చాలా ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే, గత ఏడేళ్లుగా ఆ మహిళ పొరుగూరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల భర్తకు ఈ విషయం తెలియడంతో ఆమెను నిలదీశాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ప్రియుడు తమతోనే ఉంటాడని, అలాగైతే ఇంటి ఆర్థిక సమస్యలు కూడా తొలుగుతాయని భర్తను కోరింది. ఇందుకు అతడు అంగీకరించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. ఈ క్రమంలోనే గ్రామంలోని కరెంట్ స్తంభం ఎక్కి నిరసన చేపట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌కు ఫోన్‌ చేయడంతో వారు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను బలవంతంగా కిందకు దించాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Recent

- Advertisment -spot_img