భార్య భర్తలు ఇలాంటి సమయంలో కలవకూడదని శాస్త్రాలు చెబున్నాయి. ఇలా చేసినట్లయితే సుఖ, సంతోషాలతో పాటు నష్టాలు సంభవిస్తాయి అని నమ్మకం. స్త్రీ-పురుషులు ఈ సృష్టికి రెండు మూలస్తంభాలు. ఎందుకంటే ఈ విశ్వంలో మనుషుల పుట్టుక కారణానికి వారి కలయిక కారణం. పెళ్లికి ముందు స్త్రీ-పురుషుల కలవడమనేది నికృష్ఠమైన కర్మగా భావిస్తారు. మన శాస్త్రాల ప్రకారం పెళ్లికి ముందు శృంగారం పాపం. ఎందుకంటే కలయిక అనేది వారి వారి నమ్మకాలతో సమానంగా పరిగణిస్తారు. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు కలిస్తే అది చాలా పవిత్ర కార్యంగా భావించాలి. అయితే శాస్త్రాల ప్రకారం వివాహం తర్వాత కూడా స్త్రీ-పురుషులు కొన్ని సమయాలు, తిథుల్లో అస్సుల కలవకూడదు. ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇంట్లో సుఖ, సంతోషాలు లేకపోవడమే కాకుండా అనేక రకాల నష్టాలు సంభవిస్తాయి. ఇదే సమయంలో కుటుంబ ఆనందం కూడా ప్రభావితమవుతుంది. మరి భార్య-భర్తలు శారీరకంగా ఏ సమయాల్లో కలవకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
పౌర్ణమి: పౌర్ణమి తిథుల్లో భార్య-భర్తలు ఏకం కావడం సరికాదు. శాస్త్రాల ఈ కార్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఆ రోజును లక్ష్మీదేవికి అంకితమిచ్చారు. రాత్రిపూట మహాలక్ష్మీ ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా పొందవచ్చు. భార్య-భర్తలు ఆ రోజు రాత్రిని శారీరక బంధాన్ని పెట్టుకోకూడదు. లేకుంటే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఫలితంగా అనేక రకాల ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి.
అమవాస్య: హిందూ శాస్త్రాల ప్రకారం అమవాస్య తిథుల్లోనూ భార్య-భర్తలు కలవకూడదు. ఇది వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందుకు కారణం అమవాస్య రోజు ప్రతికూల శక్తుల శక్తిమంతంగా ఉంటాయి. అంతేకాకుండా ఆ రాత్రిని తాంత్రికకాల రాత్రిగా పరిగణిస్తారు. అమవాస్య రోజు స్వచ్ఛంద సేవా కార్యాక్రమాల్లో పాల్గొనాలు. అంతేకాకుండా పవిత్ర నదుల్లో స్నానం మాచరించాలి. ఫలితంగా దేవతలు సంతృప్తి చెంది వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు.
పూర్వీకుల మరణ తిథులు: పితృదేవతలు లేదా పూర్వీకుల మరణ తిథుల్లో భార్యభర్తలు ఒకరికొకరు వేరుగా ఉండాలి. అంటే వారు శారీరకంగా కలవకూడదు. పితృదేవతలను ఆ రోజు స్మరించుకొని వారి పేరు మీదుగా దానాలు చేయాలి. అంతేకాకుండా మనస్సు, శరీరం స్వచ్ఛంగా ఉంటుంది. ఈ రాత్రి భార్య-భర్తలు కలిసినట్లయితే పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదముంది. ఫలితంగా ఇంట్లో సంతాన సమస్యలను కలిగిస్తారు.
ఏకాదశి: ఏకాదశిని శ్రీ మహావిష్ణువుకు పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శ్రీకృష్ణుడికి ఉపవాసం పాటించి, ఆరాధించడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఉపవాసం పాటించనప్పటికీ ఏకాదశి నియమాలను మాత్రం ఉల్లంఘించకూడదు. ఆ రాత్రి భార్యభర్తలు శారీరక సంబంధాలు పెట్టుకోకూడదు. అత్యంత చెడుగా పరిగణిస్తారు. ఫలితంగా భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు.
శివరాత్రి: పురాణాల ప్రకారం ప్రతి నెల వాచ్చే మాస శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు ఎంతో స్వచ్చంగా ఉండాలి. అంతేకాకుండా శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్రహ్మచర్యను పూర్తిగా పాటించాలి. అప్పుడే ఆ శుభతిథి ప్రయోజనం పొందుతారు. ఒకవేళ అనుకోకుండా ఆ రాత్రి స్త్రీ-పురుషులు కలిసినట్లయితే భయంకరమైన ఫలితాలను చవిచూడాల్సి వస్తుంది. అంటే గ్రహా దుర్మార్గపు దృష్టి మీపై పడుతుంది.
నవరాత్రులు: నవరాత్రులైన తొమ్మిది రోజులను సనాతన ధర్మం ప్రకారం చాలా పవిత్రంగా భావిస్తారు. కొంతమంది అన్ని రోజు వ్రతమాచరిస్తారు. మరి కొంతమంది కేవలం మొదటి 8 రోజులు మాత్రమే కొలుస్తారు. ఈ రోజు కలశాన్ని ప్రతిష్టాపించి దేవతను శ్రద్ధానిత్యలతో పూజలు చేస్తారు. కాబట్టి నవరాత్రి తిథుల్లో శారీరక సంబంధం పెట్టుకోవడాన్ని శాస్త్రాల్లో నిషేధించారు. ఒకవేళ ఇలా చేసినట్లయితే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.