Homeహైదరాబాద్latest NewsHYD: యువతులతో పబ్‌లో అశ్లీల నృత్యాలు..

HYD: యువతులతో పబ్‌లో అశ్లీల నృత్యాలు..

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్​ కొనసాగుతోందన్న పక్కా సమాచారంతో బంజారాహిల్స్​ రోడ్డు నంబర్​ 14లోని ఆఫ్టర్​ 9​ పబ్​పై దాడులు చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు నిర్వహించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 32 మంది యువతులను తీసుకువచ్చి, నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని చెప్పారు. గత నాలుగు రోజులుగా పబ్‌పై నిఘా పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పబ్ యజమాని సతీశ్​​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

మరోవైపు మొత్తం 32 మంది యువతులను, 131 మంది యువకులను అదుపులోకి తీసుకుని నోటీసులు ఇచ్చి పంపించేశారు. అదుపులోకి తీసుకున్న వారందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించి పంపించారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు. మరోవైపు పబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ దిశగా విచారణ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img