Homeహైదరాబాద్latest NewsHYD : బస్సు కింద పడి యువకుడి మృతి

HYD : బస్సు కింద పడి యువకుడి మృతి

ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఉప్పల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బోడుప్పల్ నుంచి ఉప్పల్ వెళ్లే క్రమంలో NH 202 జాతీయ రహదారిపై ఉప్పల్ చెరువుకట్టపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం నుంచి యువకుడు రోడ్డుపై పడపోయాడు. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు యువకుడి తలమీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img