హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 23న హనుమాన్ శోభాయాత్ర చేపట్టనున్నట్లు వీర హనుమాన్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ విజిత్ వర్మ తెలిపారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ ఆంజనేయస్వామి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 23 న మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అన్నదానం అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని.. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరారు. యాత్రలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించామని అధికారులు పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.