సయ్యద్ ఒమర్ జలీల్ నియామకం
hyderabad: తెలంగాణ మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ సయ్యద్ ఒమర్ జలీల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పదవిలో పనిచేసిన 1997 బ్యాచ్ చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీమ్ కార్మికశాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. దీంతో సయ్యద్ ఒమర్ కు అవకాశం దక్కింది.