ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ఇండస్ట్రీ నిర్మాతలు, హీరోలు, దర్శకులు సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ అనంతరం ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మీడియాతో మాట్లాడారు.. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించమని అని నిర్మాత దిల్ రాజ్ అన్నారు. హైదరాబాద్‌లో హాలీవుడ్ సినిమా షూటింగ్‌లు జరిగేలా సలహాలు ఇవ్వాలని సీఎం కోరారు అని దిల్ రాజు తెలిపారు. హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినిమా హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తాం.. సామాజిక కార్యక్రమాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఉండాలని ప్రభుత్వం కోరింది అని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై పోరాటంలో సినిమా హీరోలు పాల్గొంటారు అమీ తెలిపారు. సంక్రాంతి సినిమాలు, సినిమా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అది ఇంపార్టెంట్ కాదు అని దిల్ రాజు అన్నారు. కొన్ని ఘటనల వల్ల ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది అయితే ఇండస్ట్రీకి ఏమేం కావాలో మేం సీఎంను కోరాం అని దిల్ రాజు భేటీ అనంతరం తెలిపారు.