Homeహైదరాబాద్latest News4 ఏళ్లకే లాభాల్లోకి హైదరాబాద్ కంపెనీ

4 ఏళ్లకే లాభాల్లోకి హైదరాబాద్ కంపెనీ

ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ సిల్లీమాంక్స్ భారీ లాభాలను ఆర్జించింది. గత నాలుగేళ్లుగా నష్టాలను చవిచూస్తోన్న ఈ సంస్థ ఈ సంవత్సరం జనవరి – మార్చి త్రైమాసికానికి గాను రూ. 26.83 లక్షల లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.5 కోట్లమేర నష్టపోయింది. ప్రస్తుత లాభాలు పెట్టుబడిదారులకు ఊరట కలిగించనున్నాయి.

కంపెనీ సహవ్యవస్థాపకులు, ఎండీ సంజయ్ రెడ్డి మాట్లాడుతూ..’ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కీలకంగా ఉన్న ఈ సంస్థ నాలుగేళ్ల తర్వాత లాభాలు గడించడం గొప్ప విజయం. కొన్ని వ్యూహాత్మక విధానాలే ఇందుకు ప్రధాన కారణం. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాం.
క్రమశిక్షణతో కూడిన ఆర్థిక విధానాన్ని అనుసరించాం. ప్రతిభావంతులైన బృంద సభ్యులతో మరిన్ని విజయాలు సాధఇంచేందుకు సిద్దంగా ఉన్నాం’ అని అన్నారు.

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతారా, సలార్ వంటి సినిమాలకు డిజిటల్ ప్రమోషన్స్ చేసింది ఈ సంస్థ. కల్కి 2898 డి సినిమాకు కూడా వర్క్ చేస్తోంది.

Recent

- Advertisment -spot_img