హైదరాబాద్, ఇదేనిజం : పుస్తక రంగానికి ఎనలేని కృషిచేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యనిర్వాహక సభ్యులు వి బ్రహ్మం మృతి పట్ల బుక్ ఫెయిర్ అధ్యక్ష కార్యదర్శులు జూలూరు గౌరీ శంకర్, కోయ చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వరరావులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా వాసి అయిన బ్రహ్మం విశాలాంధ్ర బుక్ హౌస్ లో ఉద్యోగిగా చేరి, తన ఉద్యోగ విరమణ అనంతరం గాంధీ బుక్ హౌస్ ఏర్పాటు చేశారు. బుక్ ఫెయిర్ సొసైటీ లో అనేక సంవత్సరాలుగా కార్యనిర్వాహక సభ్యులుగా పనిచేస్తూ హైదరాబాద్ మరియు జిల్లాలలో జరిగిన అన్ని పుస్తక ప్రదర్శనలో భాగస్వామ్యం అయ్యారు. గత నలభై సంవత్సరాలుగా ఈ రంగం లో పని చేస్తున్నాడు పుస్తకానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. 4 రోజుల క్రితం అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాడు. ఆర్గాన్స్ సరిగా పనిచేయకపోవడంతో సోమవారం నాడు వెంటిలేటర్ పై సాయంత్రం ఏడు గంటలకు చనిపోయాడు.. ఆయన మృతి పట్ల బుక్ ఫెయిర్ సొసైటీ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ సంతాపాన్ని ప్రకటిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలిపారు.