– ఛాతిలో నొప్పిరావడంతో అపోలో ఆస్పత్రికి తరలింపు
ఇదే నిజం, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ సీపీ ఆఫీసులో ఉండగా సందీప్ శాండిల్య ఛాతీనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు.