ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్ బేగ్ ఇక లేరు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి చాతిలో తీవ్రమైన నొప్పితో తుదిశ్వాస విడిచారు. బేగ్ వయసు 84 ఏళ్లు. మెహదీపట్నం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన క్రికెట్ కెరీర్‌లో బేగ్ సార్ నేవీ నుంచి సర్వీస్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కోచ్‌గా విశిష్ట సేవలు అందించారు. భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, రవిశాస్త్రి, అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌తోపాటు ఎల్ శివరామకృష్ణన్, భరత్ అరుణ్, సంజయ్ మంజ్రేకర్, ఎంఎస్‌కే ప్రసాద్, రాబిన్ ఉతప్ప, నోయెల్ డేవిడ్, పూర్ణిమా రావు, రజనీ వేణుగోపాల్ వంటి అనేక అంతర్జాతీయ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు.
Hyderabad cricketer Baig is no more హైదరాబాద్ క్రికెటర్ బేగ్ ఇక లేరు తీవ్రమైన చాతినొప్పితో కన్నుమూత
RELATED ARTICLES