Hyderabad Cyclone : ప్రజలకు అలెర్ట్.. హైదరాబాద్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది. తుఫాను కారణంగా ఈదురుగాలులతో కూడిన ఉరుములతో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా పటాన్‌చెరు, లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, హఫీజ్‌పేట్, గచ్చిబౌలికి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 2 గంటల్లో కూకట్‌పల్లి, మాదాపూర్, జేఎన్‌టీయూ, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ సూచనలను జారీ చేసింది.