– ఎన్టీఆర్ మార్గ్ వద్దకు భారీగా చేరుకుంటున్న విగ్రహాలు
– ట్యాంక్‌బండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
ఇదే నిజం, హైదరాబాద్: భాగ్యనగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనోత్సవం కొనసాగుతున్నది. దేవీశరన్న నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో నెలకొల్పిన దుర్గామాత విగ్రహాలు.. భారీ వాహనాల్లో ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంటున్నాయి. బుధవారం రాత్రి నుంచి అంగరంగ వైభవంగా నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి. దుర్గాదేవి నిమజ్జనోత్సవాలను చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. నిమజ్జనోత్సవం నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా విగ్రహాలు తరలి రావడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి.