Hyderabad Latest News : కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా దేశంలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. మెరుగైన జీవనశైలిలో హైదరాబాద్ వాసులు మిగతా నగరాల కంటే ముందున్నట్లు మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనే సంస్థ వెల్లడించింది. వాయు కాలుష్యం, క్రైమ్ రేట్, నిత్యావసర్ సరుకులు..తదితర అంశాల్లో తగ్గుదల ప్రధాన అంశాలుగా పేర్కొంది. దేశవ్యప్తంగా ప్రజలు ఇక్కడ స్థిరపడుతున్నారని..ఐటీ, ఫార్మా రంగాల్లో గణనీయ అభివృద్ధి జరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ 153 వ స్థానంలో ఉండగా..అస్ట్రియాలోని వియాన్నా, స్విట్జర్లాండ్‌లోని జూరిచ్, న్యూజిల్యాండ్‌లోని ఆక్లాండ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి.