Homeఫ్లాష్ ఫ్లాష్టాప్ 3 టురిస్ట్ సిటీల్లో 'హైదరాబాద్'కు చోటు

టాప్ 3 టురిస్ట్ సిటీల్లో ‘హైదరాబాద్’కు చోటు

హైదరాబాద్: భారతదేశంలో అత్యధికంగా సందర్శించిన మూడు రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణా నిలిచింది.

ప్రపంచంలో అగ్రశ్రేణి ఆతిథ్యరంగ సంస్థ ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తమ మూడవ వార్షిక ట్రావెల్‌ ఇండెక్స్‌– ఓయో ట్రావెలోపిడియా 2020ను నేడు విడుదల చేసింది.

ఏప్రిల్‌ 2020 అత్యధిక క్యాన్సిలేషన్స్‌ జరిగిన నెలగా నిలిచిందని పేర్కొంది.

కరోనా కాలంలోనూ ఓయోకు మాత్రం అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన దేశంగా ఇండియా నిలిచిందని తెలిపింది.

2020లో అత్యధికంగా బుకింగ్స్‌ జరిగిన నగరాలలో ఢిల్లీ నిలిస్తే, వ్యాపార పర్యాటకుల కోసం అగ్రశ్రేణి మూడు నగరాలలో ఒకటిగా హైదరాబాద్‌ నిలిచింది.

భారతదేశపు అత్యున్నత భక్తి కేంద్రంగా పూరి నిలిచింది. ఆతర్వాత బృందావన్‌, తిరుపతి, షిర్డీ, వారణాసి ఉన్నాయి.

బీచ్‌ కేంద్రాల పరంగా గోవా తన స్థానం నిలుపుకోగా కొచి, వైజాగ్‌, పాండిశ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

హెరిటేజ్‌ నగరాలుగా జైపూర్‌, ఉదయ్‌పూర్‌, ఆగ్రాలను అధికశాతం మంది భారతీయులు ఎంచుకున్నారు.

Recent

- Advertisment -spot_img