Homeఫ్లాష్ ఫ్లాష్ఆఫీస్ స్పేస్‌లో తిరిగి పుంజుకుంటున్న‌ హైదరాబాద్

ఆఫీస్ స్పేస్‌లో తిరిగి పుంజుకుంటున్న‌ హైదరాబాద్

హైదరాబాద్: క‌రోనా మ‌హామ్మారి అన్ని రంగాల‌పై పంజా విసిరింది. దీంతో మార్చి నుండి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పడిపోయిన విషయం తెలిసిందే.

అన్‌లాక్ తర్వాత పరిస్థితి క్ర‌మంగా మారుతుంది. అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మళ్ళీ డిమాండ్ పెరుగుతోంది.

ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాల కంటే రియాల్టీ, ఆఫీస్ స్పేస్ ప‌రంగా హైదరాబాద్ బెట‌ర్ పొజిష‌న్‌లో ఉంది.

ఆఫీస్ స్పేస్ లీజులో బెంగళూరు టాప్ పొజిష‌న్ నిలుపుకోగా ఆ త‌ర్వాత స్థానంలో హైద‌రాబాద్ నిలిచింది.

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ నెట్ ఆఫీస్ స్పేస్ రికార్డ్‌స్థాయిలో 1.54 మిలియన్ చదరపుటడుగులు దాటింది.

అంతకుముందు త్రైమాసికంలో 1.18 మిలియన్ చదరపుటడుగులే కావ‌డం విశేషం.

ఈ మేరకు జేఎల్ఎల్(జోన్స్ లాంగ్ లాసెల్) డేటా నివేదిక వెల్లడించింది. రెండో త్రైమాసికంలో 9.2 శాతంగా ఉన్న వెకెన్సీ లెవల్స్ సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 11.3 శాతానికి పెరిగింది.

ముఖ్యంగా బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట బెల్ట్‌లో, హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలిలో వేకెన్సీ రేటు పెరిగిన‌ట్లు నివేదిక స్ప‌ష్టం చేసింది.

ప్ర‌ధానంగా చిన్న వ్యాపారాలు, చిన్న ఐటీ కంపెనీలు త‌ర‌లిపోతున్న‌ట్లు నివేదిక‌లో పేర్కొన్నారు. దీంతో ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఐటీ, ఐటీ సేవల కంపెనీల వాటా క్రమంగా తగ్గుతోంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img