HomeతెలంగాణHyderabad KTR:క‌టిక చీక‌ట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల‌ బీఆర్ఎస్ కావాలా..?-కేటీఆర్

Hyderabad KTR:క‌టిక చీక‌ట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల‌ బీఆర్ఎస్ కావాలా..?-కేటీఆర్

17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు స‌మావేశాలు

Hyderabad KTR: బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ‌నివారం టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌తీ రైతు వేదిక వ‌ద్ద రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు బీఆర్ఎస్ రైతు స‌మావేశాలు నిర్వ‌హించాల‌న్నారు. 3 పంట‌లు బీఆర్ఎస్ నినాదం.. 3 గంట‌ల క‌రెంటు కాంగ్రెస్ విధానం పేరిట స‌భ‌లు నిర్వ‌హించాల‌ని సూచించారు. రైతుల‌కు కాంగ్రెస్ నేత‌లు క్ష‌మాప‌ణ చెప్పేలా తీర్మానాలు చేయాల‌న్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తే ఉచిత విద్యుత్ ర‌ద్దే అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎక‌రానికి గంట విద్యుత్ చాల‌న‌డం రైతుల‌ను అవ‌మానించ‌డ‌మే అని అన్నారు. 24 గంట‌ల విద్యుత్ వ‌ద్ద‌న్న కాంగ్రెస్ కుట్ర‌ను రైతుల‌కు వివ‌రించాల‌ని సూచించారు. క‌టిక చీక‌ట్ల కాంగ్రెస్ కావాలా..? వెలుగు జిలుగుల‌ బీఆర్ఎస్ కావాలా..? తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన త‌రుణ‌మిది అని కేటీఆర్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img