హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను మెట్రో రైల్ అధికారులు రద్దు చేశారు. రూ.59 హాలిడే కార్డును (Metro Holiday Card) కూడా తొలగించారు. ఈ నిర్ణయంతో ఎండలకు కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. దీంతో మెట్రో యాజమాన్యం తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది ఏప్రిల్‌లో కూడా మెట్రో అధికారులు రాయితీలను ఎత్తివేశారు. రద్దీ సమయాల్లో డిస్కౌంట్ పూర్తిగా రద్దు చేయబడుతుంది. తాజాగా మరోసారి అదే విధానాన్ని అమలు చేస్తున్నారు.