Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలు రెండో ఫేజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పాతబస్తీ మీదుగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు నిర్మిచంనున్న మార్గంలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, పాతబస్తీ ప్రజలకు రవాణా సమస్యలు తగ్గి, ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఆస్తుల సేకరణ ప్రక్రియ జరుగుతోంది, అవసరమైన పరిహారం చెల్లించి నిర్మాణాలను కూల్చే పనులు కూడా మొదలయ్యాయి.
ఈ రెండో ఫేజ్ మెట్రో పనులు హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొస్తాయని అధికారులు భావిస్తున్నారు. పాతబస్తీలో రోడ్ల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, స్థానికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలు కల్పించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు స్థానికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఈ మెట్రో మార్గం నగరానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుందని అంచనా.