హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణ పనుల్లో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగానే మరో కీలక ముందడుగు పడింది. మెట్రో సెకండ్ ఫేజ్‌లో భాగంగా.. ఓల్డ్ సిటీ మెట్రో రైల్ రూట్ కోసం భూసేకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో.. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ, మెట్రో స్టేషన్ల నిర్మాణానికి ఆస్తులు సేకరించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా.. హైద్రాబాద్ మెట్రో రైలు అధికారులు భూసేకరణ కోసం నోటీసులు జారీ చేశారు.