Homeహైదరాబాద్latest Newsప్రశ్నార్థకంగా మారిన హైదరాబాద్ మెట్రో.. ఇందుకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వమేనా..?

ప్రశ్నార్థకంగా మారిన హైదరాబాద్ మెట్రో.. ఇందుకు కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వమేనా..?

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఆధునిక ప్రజా రవాణాకు చిరునామాగా మారింది.. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తాము మెట్రో రైలును అమ్ముకుంటామంటూ ఎల్‌అండ్‌టీ సంస్థ చేసిన ప్రకటన సంచలనం రేకెత్తించింది. పరిస్థితిని చక్కదిద్దడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తుందని భావించారు. కానీ ‘అమ్ముకుంటే అమ్ముకోనీ’ అంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టడంతో హైదరాబాద్‌ మెట్రో ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా కొనేవారుంటే పర్వాలేదు! కానీ ఎల్‌అండ్‌టీతోనే సాధ్యం కానిది మాకెలా?! అని ఎవరూ ముందుకురాకపోతే ఎల్‌అండ్‌టీ వేసే తదుపరి అడుగు ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే క్రమంలో నగరం నలువైపులా విస్తరిస్తుందనుకుంటున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై ఈ పరిణామం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img