Homeహైదరాబాద్latest NewsHyderabad: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఈ రోజు రాత్రి మరియు రేపు ఉదయం అమలులో ఉంటాయి అని తెలిపారు. బేగంపేట నుంచి రాజ్‌భవన్‌ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 7.50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజ్ భవన్ కు బయల్దేరుతారు. ఈ మార్గంలో రాత్రి 7 గంటల 50 నిమిషాల నుంచి 8 గంటల 25 నిమిషాల వరకు బేగంపేట్ వినాశ్రయం నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మోనప్ప ఐలాండ్, రాజ్ భవన్ వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించరని తెలుస్తుంది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాజ్‌భవన్‌లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి తిరిగి వెళ్తారు. రాజ్ భవన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, బేగంపేట విమానాశ్రయం మార్గంలో ఉదయం 8:35 నుంచి 9:10 గంటల వరకు వాహనాలను అనుమతించరు. ఈ సమయంలో వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

Recent

- Advertisment -spot_img