హైదరాబాద్ వాహనదారులుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త రూల్స్ ను ప్రకటించారు. ఈ నేపధ్య్మలో రోడ్లపై అనధికార స్టిక్కర్లు వేసిన వాహనాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్లపై ఏ వాహనంపైనా ఆన్ డ్యూటీ ప్రజా ప్రతినిధుల వాహనాలంటూ స్టిక్కర్లు ఉన్న, ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ అని ఉన్న, ప్రభుత్వ విధి నిర్వహణ అనే స్టిక్కర్ ఉన్న సరే అలంటి వాహనాల యజమానులపై ఎంవీ యాక్ట్ కింద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. ఇలాంటి స్టిక్కర్లు వాహనాలపై ఉంచి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ఇతర పనులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాంటి ట్రాఫిక్ పోలీసుల వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకే అలంటి వారిపై పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.