Homeహైదరాబాద్Hyderabad Police on Sukhibhava add : 'అయ్యయ్యో వద్దమ్మా' ఈ యాడ్‌ గురించి హైదరాబాద్...

Hyderabad Police on Sukhibhava add : ‘అయ్యయ్యో వద్దమ్మా’ ఈ యాడ్‌ గురించి హైదరాబాద్ పోలీసులకు తెలియడంతో..

Hyderabad Police on Sukhibhava add : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ టీ పొడి కంపెనీ యాడ్ వైరల్ అవుతోంది.

‘అయ్యయ్యో వద్దమ్మా’, ‘సుఖీభవ’ అనే రెండు డైలాగ్స్ ఈ టీ పొడి కంపెనీ యాడ్‌ వైరల్ కావడానికి కారణమయ్యాయి. 

ఈ టీ పొడి యాడ్‌లోని కంటెంట్‌ను వాడుకుంటూ మీమ్స్ పేజ్‌లు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి.

గణేష్ నిమజ్జనంలో ఓ యువకుడు ఈ డైలాగ్స్ చెబుతూ తీన్మార్ డప్పులకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రాంలో, ఫేస్‌బుక్ మీమ్స్ పేజీల్లో ఎక్కడ చూసినా ‘సుఖీభవ’, ‘అయ్యయ్యో వద్దమ్మా’ అనే డైలాగ్సే దర్శనమిస్తున్నాయి.

ఇలా వైరల్ అయిన కంటెంట్‌ను వినియోగించుకుని ప్రజల్లో మోసాల పట్ల అవగాహన కల్పించడంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ముందుంటారు.

తాజాగా.. ఈ ‘అయ్యయ్యో వద్దమ్మా’ యాడ్‌ను కూడా వాడుకున్నారు.

ఇది ఐపీఎల్ సీజన్ కావడంతో కొందరు కేటుగాళ్లు యువతనే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

క్రికెట్‌పై యువతకు ఉండే ఆసక్తిని సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు కొత్త రూటు ఎంచుకున్నారు.

‘స్పెషల్ క్రికెట్ గిఫ్ట్’ పేరుతో లింక్స్ పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఆ లింక్‌ను క్లిక్ చేస్తే గిఫ్ట్ పొందొచ్చని ఆశ చూపి.. లింక్ క్లిక్ చేయగానే వ్యక్తిగత వివరాల చోర్యానికి పాల్పడుతున్నారు.

బ్యాంకు ఖాతా వివరాలను తస్కరించి నగదును కొట్టేస్తున్నారు.

ఇలాంటి మోసాల పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘అయ్యయ్యో వద్దమ్మా’ ఇలాంటి లింక్స్‌ను క్లిక్ చేయొద్దంటూ సందేశమిస్తున్నారు.

#సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జతచేసి ఓ ఫొటోతో ఈ సందేశాన్ని ఇస్తున్నారు.

హైదరాబాద్ పోలీసులు ఏ రేంజ్‌లో అప్‌డేటెడ్‌గా ఉన్నారో తెలిసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మోసాల పట్ల అవగాహన కల్పించడంలో ‘హైదరాబాద్ సిటీ పోలీసుల రూటే సపరేటు’ అని మెచ్చుకుంటున్నారు.

వైరల్ కంటెంట్‌ను ఇలా వాడుకోవడంలో సిటీ పోలీసుల ముందుచూపుకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఈ పోస్ట్‌కు 3వేలకు పైగా లైక్స్ పడ్డాయి.

Recent

- Advertisment -spot_img