Homeహైదరాబాద్latest Newsరేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు… ఎందుకంటే..?

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు… ఎందుకంటే..?

బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని ప్రత్యేక ప్రార్థనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి ఉదయం 11.30 వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే అనుమతించనున్నట్లు వివరించారు.

Recent

- Advertisment -spot_img