Homeహైదరాబాద్latest NewsHyderabad Water : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నీటి స‌ర‌ఫ‌రా బంద్

Hyderabad Water : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నీటి స‌ర‌ఫ‌రా బంద్

Hyderabad Water : హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 12న పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది. నగరానికి తాగునీటిని సరఫరా చేసే గోదావరి పథకంలో భాగంగా హైదర్‌నగర్ నుండి అల్వాల్‌కు వెళ్లే ప్రధాన పైప్‌లైన్‌కు షాపూర్ నగర్ వద్ద మరమ్మతుల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. మరమ్మతు పనుల వల్ల కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని జలమండలి పేర్కొంది. ముఖ్యంగా.. షాపూర్ నగర్, సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్, హెచ్‌ఎంటి సొసైటీ, హెచ్‌ఎఎల్ కాలనీ, టిఎస్‌ఐఐసి కాలనీ, రోడా మేస్త్రి నగర్, శ్రీనివాస్ నగర్, ఇందిరా నగర్, గాజులరామరం, శ్రీ సాయి హిల్స్, దేవేందర్ నగర్, కైలాష్ హిల్స్, బాలాజీ లేఅవుట్, కైసర్ నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img