Hyderabad Biryani is now available in Hyderabad for just Rs.60 It is located somewhere on the road from Uppal Chowrasta in the city to Ramanthapuram. Delicious biryani is available at the ‘Thinnantha Biryani’ point. Uday and Kiran, two brothers-in-law, started the ‘Thinnantha Biryani’ point together as a startup.
ఆలోచన ఉంటే.. ఆచరణ సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు. లాభాలతో కాకుండా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆలోచించి పెట్టిన బిర్యానీ పాయింట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే బిర్యానీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ బిర్యానీ. ఈ బిర్యానీ అంటే ప్రతి ఒక్కరు కూడా లొట్టలేసుకుంటారు. ఇక యువకులు వారంతపు సెలవు వచ్చిందంటే చాలు ఎంతదూరమైన సరదాగా వెళ్లీ బిర్యానీ లాగించేస్తారు. ఎంత ధర అయిన హైదరాబాద్ బిర్యానీ అంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి ఇష్టమే. నగరంలో బిర్యానీ సెంటర్లలో ఎక్కడ చూసినా జనాలు భారీగా ఉంటుంటారు. హైదరాబాద్ నగరంలో బిర్యానీ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన వారు తప్పకుండా బిర్యానీ తినే వెళ్తారు.
కానీ హైదరాబాద్‌లో ఇప్పుడు వేడివేడి బిర్యానీ కేవలం రూ.60లకే లభిస్తుంది. అది ఎక్కడో కాదు నగరంలోని ఉప్పల్ చౌరస్తా నుంచి రామాంతపురం వెళ్లేరోడ్డులో. ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌లో రుచికరమైన బిర్యానీ లభిస్తుంది. ఉదయ్, కిరణ్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి స్టార్టప్‌గా ‘తిన్నంత బిర్యానీ’ పాయింట్‌ను ప్రారంభించారు. బిర్యానీతో పాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ అందజేస్తున్నారు. అయితే ఇది పూర్తిగా శాకాహారంతో కూడిన బిర్యానీ. తిన్నంత బిర్యానీ పెడుతున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఇటీవలే బిర్యానీ సెంటర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ జనాల్లో మాత్రం మంచి ఆదరణ లభిస్తుందని వారు చెబుతున్నారు. ఇక తక్కువ ధర ఉంది కదా .. బిర్యానీ నాసిరకం ఉంటుందని అనుకోవద్దని, బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నట్లు వారు తెలిపారు.