హైదరాబాద్ రోడ్లపై చెత్త వేసేవారిని గుర్తించడం జీహెచ్ఎంసీ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో తొలత ఉప్పల్ సర్కిల్లో రోడ్లపైనే చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి 23 ప్రాంతాల్లో స్థానిక కాలనీవాసుల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు గుర్తించి మైక్ సహాయంతో హెచ్చరించడం, జరిమానా రూ.1000 విధిస్తామని చెబుతుండడంతో భయపడి చెత్తవేయడంలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.