Homeజిల్లా వార్తలుమాదాపూర్ లో మళ్ళీ హైడ్రా యాక్షన్ షురూ.. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ...

మాదాపూర్ లో మళ్ళీ హైడ్రా యాక్షన్ షురూ.. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్ల తొలగింపు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హైడ్రా మాదాపూర్ లో మళ్ళీ యాక్షన్ షురూ చేసింది. సోమవారం ఉదయం మాదాపూర్ లోని కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది తొలగించారు. కాగా కావురి హిల్స్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీల మధ్య గత కొంతకాలంగా ఈ స్థలం పై వివాదం జరుగుతుంది. కావురి హిల్స్ అసోషియషన్ నుంచి 25 సం లీజుకు ఇచ్చారని స్పోర్ట్స్ అకాడమీ నిర్వహకులు ఆరోపించారు. కాగా తమ గడువు 25 ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తోలగిస్తూన్నరని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను తోలగించిన అధికారులు కావురిహిల్స్ పార్క్ అని బోర్డు ఎర్పాటు చేయడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img