Homeజిల్లా వార్తలుహైడ్రా దూకుడు.. నేల మట్టం చేస్తున్న భవనాలు.. బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత..!

హైడ్రా దూకుడు.. నేల మట్టం చేస్తున్న భవనాలు.. బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత..!

ఇదేనిజం, శేరిలింగంపల్లి: హైదరాబాద్ లో ఓ వైపు వినాయకచవితి వేడుకలు వైభవంగా సాగుతుండగా.. మరోవైపు హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్ పరిధిలోని సున్నం చెరువులో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. సున్నం చెరువును చెరపట్టిన కబ్జాదారుల భరతం పట్టింది హైడ్రా. సున్నం చెరువులో ఉదయం హైడ్రా అధికారులు భారీ బందోబస్తుతో కూల్చివేతలు ప్రారంభించారు. మాదాపూర్ సున్నం చెరువులో 2023లో చేసిన సర్వే ప్రకారం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు, ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) పరిధి 15 ఎకరాల 23 గుంటలు, చెరువు FTL, బఫర్ జోన్ లలో పదుల సంఖ్యలో అక్రమంగా షెడ్లు నిర్మించారు. కొన్ని భవనాలు కట్టారు. సర్వే నంబర్లు 12,13,14,16 ల్లో ఉన్న ఎత్తైన కట్టడాలను హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చితుండడంతో బాధితులు భగ్గుమంటున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్ వంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.

Recent

- Advertisment -spot_img