తెలంగాణలో హైడ్రా పెను సంచలనంగా మారింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ చెరువులు, కాలువలు, కుంటలు, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అయితే హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మధురానగర్ కాలనీ D-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.