మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడంలేదని ఆయన తెలిపారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టడంలేదని స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడంలేదని, మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అని తెలిపారు. దీనిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతోందన్నారు.