హైడ్రా కూల్చివేతలను మళ్లీ మొదలు పెట్టిన సిబ్బంది. తాజాగా ఖాజాగూడలో కూచివేతలు జరిపారు. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో ఇళ్లు నిర్మించారని హైడ్రా అధికారులు వెల్లడించారు. 20కి పైగా దుకాణాలని అక్కడి నుండి తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లు, దుకాణాలు కూల్చేశారని ప్రజలు తెలిపారు.