హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో విచారణ సాగుతోంది. కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హాజరయ్యారు. అమీన్పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని హైకోర్టు వారిని ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించింది. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని అడిగింది. హైడ్రా కమిషనర్ ను కోర్టు ప్రశ్నిస్తోంది.