అల్కాపురి టౌన్షిప్లో హైడ్రా చర్యలు చేపట్టింది. మార్నింగ్ రాగా అపార్టుమెంట్లో నిబంధనలకు విరుద్ధంగా షట్టర్లు వేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు షట్టర్లను తొలగించారు. హైడ్రా, పోలీసులను మార్నింగ్ రాగా అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. గతనెల 27న మణికొండ మున్సిపల్ అధికారులు ఇక్కడి వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులకు స్పందించకపోవడంతో గురువారం షట్టర్లను తొలగించారు. ఇందుకు హైడ్రా సాయం తీసుకున్నారు.