HYDRA: హైడ్రా వీకెండ్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాత్రికి రాత్రే హైదరాబాద్ను మార్చలేరంటూ మండిపడింది. శనివారం విచారణ చేపట్టి, ఆదివారం కూల్చివేతలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారాంతాల్లో చర్యలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఉన్నా అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కూల్చివేతలపై హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ హాజరై వివరణ ఇవ్వాలంటూ.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.